Header Banner

రాష్ట్రంలో తొలిసారిగా సోలార్ సీసీ కెమెరాలు..! నేరాల్ని నిమిషాల్లో గుర్తింపు!

  Mon Apr 28, 2025 18:43        Others

తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు (SP Harshvardhan Raju) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లేవారు పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 50 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిలో 20 , గూడూరులో 20, కోడూరు మామండురు వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
డ్రోన్ కెమెరాల సహాయంతో పలు ప్రాంతంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన వారం రోజుల్లో డ్రోన్ కెమెరాలతో గంజాయి స్థావరాలు, నాటు సారా తయారీ ప్రాంతాలను గుర్తించి వారిని అదుపులో తీసుకున్నామని ఎస్పీ హర్షవర్ధన్ వెల్లడించారు. కాగా.. ఏపీలో మొట్టమొదటి సారిగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాను ఉపయోగించి అల్లరిమూకల ఆటకట్టిస్తున్నారు తిరుపతి పోలీసులు. రాత్రుళ్లు విచ్చలవిడిగా గంజాయి, నాటు సారా తయారీ, గ్యాంబిలింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు తిరుపతి పోలీసులు ఇటీవల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో మాట్రిక్ ఫోర్ ధర్మల్ డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు అల్లమూకల ఆట కట్టిస్తున్నారు. పగటి పూట ఇలాంటి వారి పనిపట్టేందుకు పోలీసుల డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇది కూడా చదవండిశుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SolarCCTV #CrimeDetection #TechnologyInnovation #FirstTimeInState #CrimePrevention #AndhraPradesh